ఇకపై ఆన్ లైన్లోనే ఇన్ కమ్ టాక్స్ ఫైలింగ్.. అందుబాటులోకి కొత్త పోర్టల్..

-

ఆదాయ పన్ను శాఖ సరికొత్త పోర్టల్ తో ముందుకు వస్తుంది. ఆదాయ పన్ను కట్టే వాళ్ళకి మరింత సులభంగా ఉండేందుకు సరికొత్త ఈ- ఫైలింగ్ పోర్టల్ ని ప్రారంభించింది. ఈ- ఫైలింగ్ పోర్టల్ ఈ రోజు నుండి అందుబాటులోకి రానుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ చెప్పిన ప్రకారం ఆదాయ పన్ను కట్టేవాళ్ళకి మరింత పారదర్శకత, త్వరితగతిన సేవలు అందించడానికి ఇది ఉపయోగపడుతుందని తెలిపింది. ఈ- ఫైలింగ్ పోర్టల్ లో ఆదాయ పన్ను ఫైలింగ్ త్వరగా పూర్తవడంతో పాటు రిఫండ్స్ కూడా త్వరగా రానున్నాయి.

పన్ను కట్టేవారికి ఈ -ఫైలింగ్ పై ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే కాల్ సెంటర్ సౌలభ్యం కూడా ఉంది. ఆదాయ పన్ను ఫైలింగ్ చేయడానికి పనికివచ్చే ప్రశ్నలు ఇందులో ఉంటాయి. ఎలాంటి ఫీజు వసూలు చేయని ఆదాయ పన్ను సాఫ్ట్ వేర్ అందుబాటులో ఉంది. ఈ పోర్టల్ యాప్ రూపంలో కూడా లభ్యం అవుతుంది. కాబట్టి మొబైల్ ఫోన్ ద్వారానే ఆదాయ పన్ను ఫైలింగ్ చేయవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version