జుట్టు రాలిపోవడానికి కారణమయ్యే ఆహారాలు.. ఇప్పుడే మానేయండి.

-

జుట్టు రాలిపోవడం చాలా సాధారణంగా మారిపోయింది. జీవనశైలి, కాలుష్యం మొదలగు వాటివల్ల జుట్టు రాలిపోతుంది. ఐతే మీకీ విషయం తెలుసా? జుట్టు రాలిపోవడానికి మీరు తీసుకునే ఆహారం కూడా ఓ కారణంగా ఉంటుంది. అవును, మీ జుట్టు కుదుళ్ళని వదులుగా చేసి రాలిపోవడానికి కారణమయ్యే ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వీటిని దూరం చేసుకుంటే జుట్టు రాలడం అనే సమస్యని కొంచెమైనా అధిగమించవచ్చు.

చక్కెర

ఆహారంలో చక్కెర ఎంత తక్కువగా తీసుకుంతే అంత మంచిది. దీనివల్ల జుట్టు కుదుళ్ళు వదులుగా మారతాయి. అంతే కాదు వెంట్రుకలు పలుచగా మారి జీవం లేనట్టుగా కనిపిస్తాయి. తద్వారా జుట్టు రాలడం మొదలవుతుంది. అందుకే ఆహారంలో చక్కెర శాతాన్ని తగ్గించుకోండి. అదే కాదు రిఫైన్ చేసిన కార్బోహైడ్రేట్లని తీసుకోవడమూ తగ్గించండి.

ఆల్కహాల్

వెంట్రుకలు కెరాటిన్ అనే ప్రొటీన్ కారణంగా ఏర్పడతాయి. మీరు తీసుకునే ఆల్కహాల్, ఈ కెరాటిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. అందువల్ల జుట్టు రాలడం మొదలవుతుంది. అంతేకాదు ఆల్కహాల్ వల్ల జుట్టుకి సరైన పోషకాలు అందవు.

డైట్ సోడా

డైట్ సోడా లో కృత్రిమమైన తీపి పదార్థాలు ఉంటాయి. అందులోని చక్కెర వెంట్రుకలని బలహీనంగా చేస్తుంది. కాబట్టి డైట్ సోడా మానేయాలి.

జంక్ ఫుడ్

జంక్ ఫుడ్ లో శాచురేటెడ్, మోనోశాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. వీటివల్ల హృదయ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అదీగాక జుట్టు ఊడిపోతుంది. కాబట్టి జంక్ ఫుడ్ కి దూరంగా ఉండండి.

గ్లిసమిక్ ఇండెక్స్ ఆహారాలు

గ్లిసమిక్ ఇండెక్స్ కలిగి ఉన్న ఆహారాలు ఇన్సులిన్ ని పెరిగేలా చేస్తాయి. రిఫైన్ చేసిన పిండిపదార్థాలు, బ్రెడ్, చక్కెర మొదలగు వాటిని గ్లిసమిక్ ఆహారాలుగా చెప్పుకుంటారు. వీటిని తీసుకోవడం వల్ల హార్మోన్లలో అసమతుల్యం ఏర్పడుతుంది. కాబట్టి వీటిని ఆహారంలో భాగం చేసుకోకుండా చూసుకోండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version