ఏపీ, తెలంగాణ‌లో Ay12 వేరియంట్ గుబులు..!

-

క‌రోనా డేంజ‌ర్ బెల్స్ ఇప్ప‌టికీ మోగుతూనే ఉన్నాయి. గ‌తంతో పోలిస్తే కేసుల సంఖ్య త‌గ్గుముఖం ప‌ట్టింది కానీ పూర్తిగా క‌రోనా అంతం అవ్వలేదు. కాగా ఇప్ప‌టికే డెల్టా, డెల్టా ప్ల‌స్ వేరియంట్ లు ఆందోళ‌ణ చెందిస్తుంటే ఇప్పుడు మ‌రో వేరియంట్ భ‌య‌పెడుతోంది. డెల్టా ప్ల‌స్ వేరియంట్ నుండి ఏవై 12 అనే వేరియంట్ పుట్టుకుని వ‌చ్చింది. ఈ వేరియంట్ డెల్టా ప్ల‌స్ వేరియంట్ కంటే వేగంగా విస్త‌రిస్తోంది. ఇప్ప‌టికే ఈ వేరియంట్ బారిన ప‌డుతున్న వారి సంఖ్య కూడా వేగంగా పెరుగుతుంది.

మొద‌ట ఈ వేరియంట్ ఆగ‌స్టు 30న ఉత్త‌రాఖండ్ లో వెలుగు చూసింది. ఈ వేరియంట్ కేసులు ఏపీలో 18, తెలంగాణ లో 15 న‌మోద‌య్యాయి. కేవ‌లం వారంలోనే ఈ వేరియంట్ తెలుగు రాష్ట్రాల‌కు విస్త‌రించిందంటే వైర‌స్ వ్యాప్తి ఏ స్పీడ్ లో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇక తెలుగు రాష్ట్రాల‌లో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కూడా శ‌ర వేగంగా జ‌రుగుతోంది. వ్యాక్సినేష‌న్ డ్రైవ్ ల‌ను ఏర్పాటు చేసి వ్యాక్సిన్ ల‌ను ఇస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version