ఆర్ఎస్ ప్రవీణ్‌‌కుమార్ ఆరోపణల్లో వాస్తవం లేదు : ఎస్సీ గురుకుల సెక్రెటరీ అలుగు వర్షిణి

-

సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన ఆరోపణలను ఎస్సీ గురుకుల సొసైటీ తీవ్రంగా ఖండించింది. ఎస్సీ గురుకులాల్లో పిల్లలపై పర్యవేక్షణ బాగాలేదని ఆయన కామెంట్స్ బాధ్యతా రాహిత్యమని, ఎస్సీ గురుకుల సెక్రెటరీ అలుగు వర్షిణి తెలిపారు. రాష్ట్రంలోని గురుకులాలపై, సీఎం కామెంట్స్ చేయడం విచారకరమన్నారు.

ఆర్ఎస్ ప్రవీణ్ సెక్రెటరీగా ఉన్నప్పుడు ఎలాంటి ఘటనలు జరగలేదా? అని ప్రశ్నించారు.‘ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మా పిల్లలు అని అనడం అభ్యంతరకమైనది. కొందరు విద్యార్థులు మాత్రమే మా పిల్లలు అయితే,మిగతా వారు కాదా? వివిధ నేపథ్యాల నుంచి వచ్చిన విద్యార్థులు తెలంగాణలో భాగం కదా? ఇటువంటి భాష ఆర్ఎస్పీకి మన రాష్ట్రంలోని చిన్న పిల్లల పట్ల ఉన్న సంకుచిత ఆలోచనను ప్రతిబింబిస్తోందని’ తెలిపింది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version