ఈనెల డిసెంబర్ 30న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయోధ్యలో ప్రారంభించబోయే విమానాశ్రయానికి ‘మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం అయోధ్య దామ్’ గా నామకరణం చేశారు.రామాయణ పురాణ రచయితగా ప్రసిద్ధి చెందిన పురాణ కవి వాల్మీకి పేరు ఈ విమానాశ్రయానికి పెట్టారు. దీనిని గతంలో ‘మర్యాద పురుషోత్తం శ్రీ రామ్ అయోధ్య అంతర్జాతీయ విమానాశ్రయం’ అని పిలిచేవారు. అంతకంటే ముందు రోజు డిసెంబర్ 27న అయోధ్య రైల్వే స్టేషన్ పేరును అయోధ్య ధామ్ జంక్షన్గా మార్చారు.ఈ మేరకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
2024 జనవరి 22న మహా సంప్రోక్షణ కార్యక్రమం జరగనుంది. ఎయిర్ పోర్టు ప్రారంభించిన రోజున, మొదటి విమానాలను ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్,ఇండిగో నిర్వహిస్తాయి. రెండు విమానయాన సంస్థలు ఇప్పటికే ఢిల్లీ, అహ్మదాబాద్,ముంబై నుండి అయోధ్యకు విమానాలను ప్రకటించాయి, ఇవి జనవరి 2024 నుంచి ప్రయాణికులకు సేవలు అందుబాటులోకి తీసుకురాను న్నాయి.
Ayodhya :అయోధ్యలోని కొత్త విమానాశ్రయానికి ఏం పేరు పెట్టారో తెలుసా….
-