రేపు జగనన్న విద్య దీవెన నిధులు రిలీజ్ కానున్నాయి. 2023 ,జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి లబ్దిదారుల అకౌంట్ లో నిధులు జమ కానున్నాయి. వర్చువల్ గా లబ్ధిదారుల ఖాతాల్లో ముఖ్యమంత్రి వైయస్ జగన్ నిధులు జమ చేయనున్నారు.దీని ద్వారా 8,09,039 మంది విద్యార్థులకు రూ.584 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. 11 లక్షలకు పైగా తల్లుల అకౌంట్ లలో ఈ మొత్తాన్ని జమ చేయనున్నారు.
ఇదిలా ఉంటే.. రేపు సీఎం వైఎస్ జగన్ భీమవరంలో పర్యటించనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి భీమవరం వెళ్తారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ పాల్గొంటారు. ఆరోజే జగనన్న విద్యాదీవెన పథకం కింద విద్యార్దుల తల్లుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తారు. ఆ తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సీఎం జగన్ పర్యటన సందర్భంగా పార్టీ నేతలు పెద్దఎత్తున జనసమీకరణ చేయనున్నారు. ఈ బహిరంగ సభ కోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.