ఫైజాబాద్ ఎంపీ అవధేష్ ప్రసాద్ ఎమోషనల్ అయ్యారు. అయోధ్య కూడా ఈ ఫైజాబాద్ ఎంపీ పరిధి కిందకే వస్తుంది. గత ఏడాది ఫైజాబాద్ నుంచి సమాజ్ వాది పార్టీ తరపున గెలిచిన అవధేశ్ ప్రసాద్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారారు. ఆయన దళిత యువతి అత్యాచారం, హత్య పై భావోద్వేగానికి గురయ్యారు. అయోధ్యకు సమీపంలో అత్యాచారం చేసి, హత్యకు గురైన దళిత మహిళా కుటుంబానికి న్యాయం జరగకపోతే ఎంపీ పదవీకి రాజీనామా చేస్తానని విలేకర్ల సమావేశంలో విలపించారు.
దీనికి సంబంధించిన విజువల్స్ వైరల్ అయ్యాయి. తాను ఈ విషయాన్ని లోక్ సభలో ప్రధాని మోడీ ముందు లేవనెత్తుతానని అన్నారు. మాకు న్యాయం జరగకపోతే ఎంపీ పదవీకి కూడా రాజీనామా చేస్తానని హెచ్చరించారు. మనం మన ఆడకూతుళ్లను కాపాడుకోవడంలో విఫలం అవుతున్నామని పేర్కొన్నారు. మర్యాద పురుషోత్తమ రామ, సీతా మాత మీరు ఎక్కడ ఉన్నారు అంటూ విలపించారు. అయోధ్యలోన మిల్కిపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరగడానికి కొద్ది రోజుల ముందు ఈ ఘటన జరిగింది.