అయోధ్య కేసులో మరో ట్విస్ట్: రామల్లల్లా, విరాజ్ మాన్‌కు అనుకూలంగా తీర్పు….

-

ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అయోధ్య కేసులో వివాదాస్పదంగా ఉన్న 2.77 ఎకరాలకు సంబంధించిన హక్కులపై దాఖలైన పిటిషన్లపై సుప్రీం ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం నేడు తుది తీర్పుని వెలువరిస్తుంది. ఇందులో భాగంగా అయోధ్యకు సంబంధించి నిర్మోహి అఖాడా‌ పిటిషన్‌ను ఆర్టికల్ 120 ప్రకారం సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ వివాదాస్పద భూమికి సంబంధించి నిర్మోహి అఖాడా మేనేజర్ కాదని స్పష్టం చేసింది.

అంటే నిర్మోహి అఖాడా‌ పిటిషన్‌ను కొట్టేయడం ద్వారా రామల్లల్లా, విరాజ్ మాన్ లకు అనుకూలంగా తీర్పు వచ్చినట్లైంది. అయోధ్యలో రాముడు జన్మించాడని అందులో అనుమానం లేదని ధర్మాసనం వెల్లడించింది. అయితే అక్కడ బాబ్రీ మసీదు కూడా ఉందని, ఆ మసీదుని బాబర్ సైన్యాధికారులు నియమించారని చెప్పారు. కాకపోతే బాబ్రీ మసీదు కూల్చివేతకు ముందు అక్కడ దేవాలయం ఉందా? మసీదు ఉందా? అనే విషయంపై క్లారీటీ లేదని చెప్పారు. కాకపోతే తాము మత విశ్వాసాల ఆధారంగా తీర్పు ఇవ్వడం లేదని కోర్టు చెప్పింది.

అలాగే 2.77 ఎకరాలు వివాదాస్పద స్థలానికి సంబంధించి ఎవరి దగ్గర అసలైన డాక్యుమెంట్లు ఉంటాయో వారి హక్కు దారులని చెబుతుంది. ముస్లింల దగ్గరే అసలైన డాక్యుమెంట్లు ఉన్నట్లు వెల్లడించింది. అయితే 1885కి ముందు హిందువులు ప్రార్ధనలు చేయకుండా ఎవరు ఆపలేదని, అందుకే వివాదాస్పద స్థలానికి సంబంధించి ముస్లింలు హక్కు దక్కించుకోలేదని చెప్పింది. కాకపోతే ఇక్కడ ముస్లింలు, హిందువులు సమానంగా ప్రార్ధనలు చేసుకోవచ్చని వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version