మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమాకు ఆస‌క్తిక‌ర టైటిల్..

-

మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ తెలుగులో మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు చిరంజీవి కొరటాల శివ కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను డిసెంబరులో రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించనున్నారు. ఇక‌ ఇప్పటికే సినిమాని ఆఫీషల్ గా అనౌన్స్ చేసారు. పక్కా సోషల్ మెసేజ్ తో ,కమర్షల్ హంగులతో ఈ సినిమా తెరకెక్కుతుంది. మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్ సంస్థతో కలిసి కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో చిరంజీవి రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నట్టు ఇండస్ట్రీ టాక్.

అంతేకాదు, దేవాదాయ శాఖలో జరుగుతోన్న అక్రమాల చుట్టూ ఈ సినిమా కథ‌ ఉండబోతుందని, ఇందులో చిరంజీవి ఆచార్య అనే పాత్రలో కనిపించనున్నారని తెలుస్తుంది. ఇక‌ తాజాగా ఈ సినిమాకు ‘గోవింద హరి గోవింద’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు తెలిసింది. అయితే దీనిపైన ఇంకా ఎటువంటి అధికార ప్రకటన వెలువడలేదు. కాగా, ఈ సినిమా కోసం చిరంజీవి కూడా బాగానే కసరత్తులు చేస్తున్నారు. స్లిమ్ గా అయ్యేందుకు జిమ్ లో బాగానే కష్టపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version