అయోధ్యకేసులో సుప్రీం కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. గతంలో అలహాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పుని తప్పుబడుతూ… వివాదాస్పద స్థలం 2.77 ఎకరాలని పంచే ప్రసక్తి లేదని , ఆ స్థలాన్ని మూడు నెలల్లో అయోధ్య ట్రస్ట్ కు కేటాయించాలని , ఆ ట్రస్ట్ కు హక్కుదారుకు ఇవ్వాలని సుప్రీం స్పష్టం చేసింది.
అటు సున్నీ వక్ఫ్ బోర్డుకు భూమిపై ఎలాంటి హక్కు లేదని, అలాగే మరో ఐదు ఎకరాల స్థలన్ని మసీదుకు కేటాయించాలని కోర్టు వెలువరించింది.
వివాదాస్పద భూమి హక్కు విషయంలో సున్నీ వక్ఫ్ బోర్డు సరైన డాక్యుమెంట్లు చూపించడం విఫలం కాగా, అయోధ్య ట్రస్ట్ సరైన డాక్యుమెంట్లు చూపించడంతో ఆ స్థలం అయోధ్య ట్రస్ట్ కు దక్కనుంది. అలాగే మసీదుకు మరోచోట ఐదు ఎకరాలు కేటాయించాలని తీర్పు ఇచ్చింది. ఇక అక్కడ ముస్లింలు నమాజ్ చేయడంలో తప్పులేదని.. హిందువులు పూజలు చేయడంలో కూడా తప్పు లేదని స్పష్టం చేసింది.
మూడు నెలల్లోగా అయోధ్య ట్రస్ట్ ని ఏర్పాటు చెయ్యాలని వివాదాస్పద స్థలాన్ని అయోధ్య ట్రస్ట్ ని ఏర్పాటు చెయ్యాలని ప్రకటించింది. అయోధ్య ట్రస్ట్ ఏ దానికి హక్కు దారు. ఆదెకరాల స్థలాన్ని సున్నీ వక్ఫ్ బోర్డు కి కేటాయించాలి. అక్కడ మసీదు నిర్మాణం జరపాలి. ఎకరాల స్థలం అయోధ్య ట్రస్ట్ కి కేటాయించాలి. వివాదాస్పద స్థలం రామ్ లాలా ట్రస్ట్ కు మాత్రమే ఆ స్థలం చెందుతుంది. వారు సరైన పత్రాలను చూపించారని తెలిపింది.
అయోధ్యలో ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలాన్ని ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించింది. వివాదాస్పద భూభాగాన్ని అలహాబాద్ హైకోర్టు విభజించడం ఆమోదయోగ్యం కాదని సుప్రీం స్పష్టం చేసింది. మసీదు కూల్చివేత చట్టవిరుద్ధమని పేర్కొంది. ఇక ఈ క్రమంలోనే అటు హిందువులు, ఇటు ముస్లింలు బాయి బాయి అన్న భారతదేశ ఐక్యతను సుప్రీంకోర్టు తీర్పు స్పష్టం చేసింది. ఇక యునానిమస్ జడ్జ్‌మెంట్ కావడంతో దీనిపై రివ్యూ వేసే అవకాశాలు కూడా తక్కువే.