ఎండాకాలంలో ఎండల వలన ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉంటారు చాలా మంది. ఎండాకాలంలో ఎలాంటి సమస్య కలగకుండా ఉండాలంటే ఈ ఆయుర్వేద చిట్కాలు బాగా పనిచేస్తాయి. ఈ ఆయుర్వేద చిట్కాలతో సులభంగా హీట్ స్ట్రోక్ నుండి బయటపడొచ్చు. ఆయుర్వేదం లో చాలా రెమెడీస్ ఉన్నాయి. వేడిని తట్టుకోవడం మొదలు వడదెబ్బ మొదలైన సమస్యల నుండి బయట పడేసేందుకు ఆయుర్వేద చిట్కాలు చక్కగా పని చేస్తాయి వడదెబ్బ కలగకుండా ఉండాలంటే ఎండాకాలంలో ఈ చిట్కాలు తప్పక ట్రై చేయండి.
ఎండాకాలంలో ఇబ్బందులు ఏమీ కలగకుండా ఉండాలంటే ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోండి మంచినీళ్లు కొబ్బరి నీళ్లు తీసుకుంటూ ఉండండి. చల్లగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోండి పుచ్చకాయ, కీరా, పుదీనా, కొత్తిమీర వంటివి. అలానే ఎండాకాలంలో బాగా కారంగా ఉండేవి ఆయిల్ ఫుడ్స్ ని అసలు తీసుకోవద్దు. వేసవికాలంలో వీటిని తీసుకుంటే సమస్యలు వస్తాయి.
చల్లటి స్నానం వేసవికాలంలో సమస్యలను పోగొడుతుంది. అలానే వేసవికాలంలో వదులుగా ఉండే దుస్తులను ధరించండి. దాంతో గాలి ఆడుతుంది కొత్తిమీర మెంతులు జీలకర్ర పుదీనా వంటివి తీసుకుంటే చాలా ఉపశమనంగా ఉంటుంది. ఆయుర్వేద గుణాలు వీటిలో ఉంటూ ఉంటాయి. హీట్ స్ట్రోక్ నుండి మీకు రక్షణ వస్తుంది యోగా ప్రాణాయమం చేస్తే ప్రశాంతంగా ఉంటుంది. సూర్య నమస్కారాలు కూడా చేసుకోవచ్చు. చల్లగా ఉండేందుకు గంధాన్ని రాసుకుంటే చల్లగా ఉంటుంది. ఇలా ఈ లాభాలని మీరు వేసవికాలంలో పొంది ఆరోగ్యంగా ఆనందంగా ఉండొచ్చు.