బిగ్ బ్రేకింగ్: ఢిల్లీకి ఆనందయ్య మందు… వీడియోలు బయటపెట్టిన ప్రముఖ ఛానల్

-

నెల్లూరు కృష్ణపట్నంలో ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య తయారు చేసిన మందుకి సంబంధించి ఒక ప్రముఖ ఛానల్ ప్రసారం చేసిన కథనం సంచలనం అయింది. ఆనందయ్య తయారు చేయించిన మందుని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. బకెట్ లతో ఇతర రాష్ట్రాలు ఢిల్లీ, రాజస్థాన్ కూడా పంపిస్తున్నారు అని తెలిసింది. దీనికి సంబంధించి మా వద్ద వీడియోలు ఉన్నాయని కొన్ని వీడియోలు బయట పెట్టింది ఛానల్.

కృష్ణ పట్నంలో 144 సెక్షన్ అమలు అవుతుందని భారీగా పోలీసుల బందోబస్తు కూడా ఏర్పాటు చేసారని కథనంలో పేర్కొంది. ఇక ఆనందయ్య ని వంట మనిషిగా మార్చారని విపక్షాలు మండిపడుతున్నాయి. దీనితో ఇప్పుడు ఈ మందుని పలుకుబడి ఉన్న వాళ్లకు పంపిస్తున్నారా అనే అనుమానాలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version