తెలంగాణలో ఆయుష్మాన్‌ భారత్‌కు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్

-

తెలంగాణలో ఆయుష్మాన్‌ భారత్‌కు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ఆయుష్మాన్ భారత్ (ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన) పథకంలో చేరాలని కేసీఆర్ నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ, నేషనల్ హెల్త్ అథారిటీతో ఎంఓయు కుదుర్చుకుంది. తదనుగుణంగా ఆయుష్మాన్ భారత్ పథకం అమలుకు సంబంధించిన విధి విధానాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఖరారు చేసింది. దీని ప్రకారం నియమ నిబంధనలను అనుసరిస్తూ రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య సేవలు అందించాలని వైద్యారోగ్య శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. ఈ మేరకు, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.ఎ.ఎం. రిజ్వీ, రాష్ట్ర ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్టు సీఈఓకు అమలుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు.

కాగా కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్‌ భారత్‌ను 2018 సెప్టెంబర్‌లో ప్రారభించింది. ఆయుష్మాన్‌ ప్రపంచంలోనే అతి పెద్ద ఆరోగ్య భీమా పథకమని కేంద్ర ప్రభుత్వం చెబుతోన్న విషయం తెల్సిందే. ఇక ఈ పథకం కింద పేద కుటుంబాలకు ఆయుష్మాన్ కార్డు అందిస్తారు. ఆయుష్మాన్ భారత్‌ కింద దేశవ్యాప్తంగా 20 వేలకు పైగా ఆసుపత్రులలో 1000 కి పైగా వ్యాధులకు చికిత్స అందిస్తారు. రూ. 5లక్షల వరకు ఉచితంగా చికిత్స పొందవచ్చు. కాగా తెలంగాణలో కూడా ఆయుష్మాన్‌ భారత్‌ను అమలు చేయాలని బీజేపీ నేతలు గత కొన్ని రోజులుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న విషయం తెల్సిందే.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version