పావ‌లా శ్యామ‌ల‌కు అండ‌గా సినీ న‌టులు.. డబ్బు, సామాగ్రి అంద‌జేత‌

-

పావ‌లా శ్యామ‌ల అంటే గుర్తు ప‌ట్ట‌ని వారుండ‌రు. టాలీవుడ్‌లో దాదాపు 250కి పైగా సినిమాల్లో న‌టించింది. ఆమె న‌ట‌నకు ఎన్నో అవార్డులు, రివార్డులు కూడా వ‌చ్చాయి. కానీ ఇదంతా గ‌తం. ఆమె ఇప్పుడు క‌డు ద‌య‌నీయ స్థితిలో ఉంది. రివార్డులు అమ్మి మ‌రీ ఇంటి అద్దె క‌డుతోంది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది.

 

అనారోగ్యం, అప్పుల కార‌ణంగా క‌నీసం తిన‌డానికి తిండి కూడా లేకుండా పోయింది. ఈమె ప‌రిస్థితి తెలుసుకున్న క‌రాటే క‌ల్యాణీ ఇంటికెళ్లి సాయం అందించారు. అంద‌రూ సాయం చేయాల‌ని కోరారు.

దీంతో చాలామంది టాలీవుడ్ న‌టులు శ్యామ‌ల‌కు సాయం చేస్తున్నారు. ఫ‌లక్‌నుమా దాస్‌లో న‌టించిన జీవ‌న్ కుమార్ శ్యామ‌ల ఇంటికెల్లి సాయం చేశాడు. అలాగే ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ శివ‌నాగేశ్వ‌ర్‌రావు బంధువులు కూడా రూ.50వేలు పంపించారు. ఇంకా చాలామంది ఆమెకు సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. దీంతో శ్యామ‌ల క‌న్నీటి ప‌ర్యంతం అవుతున్నారు. అంద‌రికీ ధ‌న్య‌వాదాలు తెలుపుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version