అత్యంత ప్రభావవంతమైన వందమందిలో ఇండియా నుండి ఒకే ఒక్క నటుడు..

-

టైమ్ మ్యాగజైన్ రూపొందించిన అత్యంత ప్రభావవంతమైన వంద మంది జాబితాలో బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా చోటు దక్కించుకున్నాడు. ఇ మేరకు ఆఅయుష్మాన్ ఖురానా ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని పంచుకున్నారు. విక్కీ డోనర్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయుష్మాన్ ఖురానా, ఆ తర్వాత పలు విజయవంతమైన చిత్రాల్లో కనిపించాడు. 2018లో వచ్చిన అంధాధున్ చిత్రం అతనికి జాతీయ అవార్డును తెచ్చిపెట్టింది. శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించిన ఈ థ్రిల్లర్ మూవీలో అంధుడిగా నటించిన ఆయుష్మాన్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.

ఈ ఏడాది టైమ్ మ్యాగజైన్ రూపొందించిన వందమంది జాబితాలో ఇండియా నుండి చోటు దక్కించుకున్న ఒకే ఒక్క నటుడు ఆయుష్మాన్ ఖురానా. ఈ లిస్టులో ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఉన్నారు. ఐతే ఆయుష్మాన్ ఖురానాపై ప్రశంసలు పడుతున్నాయి. అటు ఇండస్ట్రీ నుండి, ఇటు రాజకీయాల నుండి పలువురు అభినందనలు తెలుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version