బాలీవుడ్ యంగ్ స్టార్ హీరో ఆయుశ్మాన్ ఖురానా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన నటనతో ఇప్పుడిప్పుడే బాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నాడు. కాగా తాజాగా ఈయన తండ్రి ఆచార్య అపి ఖురానా మరణించారు. కాసేపటి క్రితమే పంజాబ్ లోని మొహలీలీ ఈయన కన్నుమూసినట్లు కుటుంబసభ్యులు తెలియచేశారు. ఈయన జ్యోతిష్యంలో బాగా ప్రావీణ్యాన్ని గడించిన వ్యక్తి కావడం విశేషం. ఇందుకు సంబంధించిన కొన్ని పుస్తకాలను కూడా రచించారట. అయితే గత కొంతకాలంగా ఈయన అనారోగ్యంతో బాధపడుతున్నాడట. ఈ వార్తతో బాలీవుడ్ లో విషాదం నింపింది.