లోకేషా.. మజాకా.: అచ్చెన్నకు టెన్షన్ పుట్టిస్తున్న అయ్యన్న!

-

ప్రస్తుతం టీడీపీలో ఏమి జరుగుతుంది అనే విషయం ఒక మోస్తరు నేతలు, కార్యకర్తలకు అర్ధం కావడం లేదు! ఇప్పుడు అంతా చినబాబు పెత్తనం స్టార్ట్ అవుతున్న దశ! ఆ పాయింట్ అలా ఉంచి ప్రస్తుతం టీడీపీ రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తే ఒక కొత్త విషయం అర్ధమవుతుంది! అదేమిటంటే… అయ్యన్న తెరపైకి చాలా అగ్రెసివ్ గా వస్తూ ఉండటం! దాని వెనక ఎవరున్నారన్నది స్పష్టం అవుతుండటం!

అవును… ప్రస్తుతం ఏపీ టీడీపీలో అయ్యన్నపాత్రుడు తెగ దూకుడు ప్రదర్శిస్తున్నారు. అయితే… ఇంతకాలం అత్యంత దూకుడు ప్రదర్శించిన అచ్చెన్న సైలంట్ అయిపోవడం. అచ్చెన్నకు తత్వం బోదపడి సైలంట్ అయిపోయారా లేక చినబాబు తనకున్న భయంవల్ల సైలంట్ చేసేశారా అన్నది తెలియాల్సి ఉంది. అయితే.. అచ్చెన్న అలక తీర్చడానికి పార్టీ అధ్యక్ష పదవిని అప్పగించాలని చంద్రబాబు నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.ఈ విషయం చినబాబుకు ఏమాత్రం నచ్చలేదని అంటున్నారు!

దానికి గల బలమైన కారణం… అచ్చెన్న దూకుడు క్యాండిడేట్ కావడంతోపాటు కార్యకర్తల దృష్టిలో, చంద్రబాబు తర్వాత అచ్చెన్నే అనే టాక్ వెళ్లిపోతుందేమో అని లోకేష్ భయం! అయితే.. ఈ విషయంలో అచ్చెన్నను కాస్త తగ్గించి, అందుకు పోటీగా అయ్యాన్నను చినబాబే రంగంలోకి దింపారని.. తనకు తెలిసిన విషయాలను, ప్రభుత్వంపై చేయాల్సిన బలమైన విమర్శలను అయ్యన్నతోనే చేయిస్తున్నారని అంటున్నారు! ఫలితంగా… అచ్చన్నే కాదు అయ్యన్న కూడా సమర్ధుడే, దూకుడున్న నేతే అని కార్యకర్తలకు కొత్త ఆప్షన్ చూపించాలనేది చినబాబు ఆలోచనగా చెబుతున్నారు!

ఇదే క్రమంలో… ప్రస్తుతం చంద్రబాబు బ్యాచ్ కాకుండా తనకంటూ సొంత బ్యాచ్ ఒకటి తయారు చేసుకోవాలనే స్థాయి ఆలోచనలు కూడా చినబాబు చేస్తున్నారని.. అందులో భాగంగానే తన స్నేహితుడు కళా వెంకట్రావుకు ఇష్టం లేని అచ్చెన్నకు ఆ పదవి ఇవ్వకుండా మద్యలో తెరపైకి అయ్యన్నను తెచ్చారని అంటున్నారు. ఇదే సమయంలో టీడీపీ అనుకూల మీడియా కూడా అయ్యన్నను హీరోని చేస్తూ తెగ కథనాలు అచ్చు వేస్తుంది! “ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తున్న అయ్యన్న” అంటూ హెడ్డింగులు పెడుతుంది! పాపం అచ్చెన్న…!!

Read more RELATED
Recommended to you

Exit mobile version