బంజారాహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో భారీ అగ్ని ప్రమాదం సంభవించిందని, ఈ రోజు ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయని ప్రచారం సాగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో పలు సినిమా సెట్టింగులు కాలిపోయాయినట్లు కూడా ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తలను ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోస్ తన ట్విట్టర్ ఎక్కౌంట్ ద్వారా ఖండించింది.
అన్నపూర్ణ స్టూడియోస్ లో అంతా బాగానే ఉందని అసలు కన్ఫర్మ్ కానీ వార్తలు ఎవరు నమ్మొద్దని తమ సోషల్ మీడియా ద్వారా పేర్కొంది. తాజాగా నాగార్జున కూడా ఈ అంశం మీద స్పందించారు. పొద్దున్న నుండి అగ్నిప్రమాదం అంటూ రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయని అదంతా దుష్ప్రచారం అని ఆయన పేర్కొన్నారు. దీంతో ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చినట్టు అయింది.
There are some articles in the media that there has been a major fire At Annapurna Studios this morning… Not to worry this is WRONG NEWS and everything is absolutely fine👍😊
— Nagarjuna Akkineni (@iamnagarjuna) October 16, 2020