జగన్ ని ఛీ కొట్టిన ఉత్తరాంధ్ర అంటూ వైసీపీ సర్కార్ పై ఫైర్ అయ్యారు టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం దిశగా సాగుతున్న తరుణంలో.. వైసీపీ సర్కార్ పై ఫైర్ అయ్యారు టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు. జగన్ ని ఛీ కొట్టిన ఉత్తరాంధ్ర…ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి…దూసుకుపోతుందని వెల్లడించారు.
ఏ రౌండ్ లోనూ, కనీసం పోటీ ఇవ్వని వైసీపీ నాలుగో రౌండ్ అయ్యే సరికి 20 వేల ఆధిక్యంలో తెలుగుదేశం అని… జగన్ ని ఉత్తరాంధ్ర ప్రజలు విశ్వసించలేదు. రాజధాని కబుర్లు నమ్మలేదని తెలిపారు. రాజధాని పేరుతో జగన్ విశాఖలో చేసిన విధ్వంసం, అలాగే గడచిన 4 ఏళ్ళ చీకటి పాలనను ప్రజలు గుర్తు చేసుకున్నారని చెప్పారు.ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు గారు మాత్రమే కాపాడగలరని గుర్తించారు. అందుకే ఈ వన్ సైడ్ ఫలితాలు.వైసీపీ అంతానికి ఆరంభం ఇదే. సైకో పోవాలి – సైకిల్ రావాలన్నారు అయ్యన్న పాత్రుడు.