విజయసాయి, జగన్ కు బడిత పూజ ఖాయమని కౌంటర్ ఇచ్చారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు. ఇవాళ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు మీడియాతో మాట్లాడుతూ… ఇంట్లో వాళ్ళు ఎవరిని లెక్క చెయ్యడం లేదో సమాజం చూసింది వీసా రెడ్డి అని.. జగన్ని ఛీకొట్టి తల్లి, చెల్లి, బావ పక్క రాష్ట్రానికి వెళ్లిపోవడం కంటే పెద్ద ఛీత్కారం ఏముంటుంది? అని చురకలు అంటించారు.
నీ రాజ్యసభ, జగన్ సీఎం పదవి పోయే రోజు దగ్గర పడిందని.. ముందు జాగ్రత్త చర్యగా కార్యకర్తల కోసం నిర్వహిస్తున్న జాబ్ మేళా లో ఉద్యోగాలు రిజర్వ్ చేసుకోండని ఎద్దేవా చేశారు. కార్యకర్తల జాబ్ మేళా కాదు హామీ ఇచ్చిన ప్రకారం ముందు 2.30 లక్షల ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు అయ్యన్నపాత్రుడు. నిరుద్యోగులు జగనుకు.. నీకు బడిత పూజ చెయ్యడం ఖాయమని హెచ్చరించారు. త్వరలోనే తెలుగు దేశం పార్టీ ఏపీలో అధికారంలోకి కూడా రాబోతుందని చెప్పారు.