ఇంకా నేనే ప్రెసిడెంట్.. జాన్ మనోజ్ నియామకం చెల్లదు : అజారుద్దీన్

-

హెచ్ సీఏ తాత్కాలిక ప్రెసిడెంట్ గా జాన్ మనోజ్ ను నియమిస్తున్నట్లు అపెక్స్ కౌన్సిల్ కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే.. దీనిపై మాజీ ప్రెసిడెంట్‌ అజారుద్దీన్ కౌంటర్‌ ఇచ్చారు. అపెక్స్ కౌన్సిల్ అనేదే భూటకమని… వాళ్ళు నోటీసులు ఇచ్చినా చెల్లవు.. ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా చెల్లవని స్పష్టం చేశారు అజారుద్దీన్‌. Hca కి ఇంకా నేనే ప్రెసిడెంట్ అని…Hca తాత్కాలిక ప్రెసిడెంట్ గా జాన్ మనోజ్ నియామకం చెల్లదని స్పష్టం చేశారు.


ఏమున్నా కోర్టుకు వెళ్లి చూసుకోవాలని పేర్కొన్నారు. అపెక్స్ కౌన్సిల్ అని చెప్పుకుంటున్న ఆ ఐదుగురే.. hca లో అసలైన దొంగలు అని సంచలన వ్యాఖ్యలు చేశారు అజారుద్దీన్‌. కేసుల్లో ఇరుక్కుని కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని…..వారు ఏసీబీ కూడా కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. వాళ్ళు కావాలనే నా పై కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. Hca లో రాజకీయ నాయకులు కానీ… రాజకీయ పార్టీల జోక్యం లేదని స్పష్టం చేశారు అజారుద్దీన్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version