హనీట్రాప్‌లో పాక్‌ కెప్టెన్‌ బాబర్‌.. న్యూడ్ వీడియో కాల్స్!

-

పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ అజమ్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ అజమ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ సెన్సేషనల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ వీడియోలో బాబర్, తన సహచరుడి గర్ల్ ఫ్రెండ్ తో అసభ్య పదజాలం ఉపయోగించి చాటింగ్ చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది.

అయితే ఇందులో ఉన్నది బాబరా లేక ఎవరైనా మార్ఫింగ్ చేసి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారా అన్న విషయం తెలియాల్సి ఉంది. నియో యాదవ్ అనే ఓ నెటిజన్ పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం క్రికెట్ సర్కిల్స్ లో, ముఖ్యంగా పాక్ క్రికెట్ వర్గాల్లో సంచలనంగా మారింది. ఇందులో ఉన్నది పాక్ కెప్టెన్ కాదు, మార్ఫింగ్ చేశారని కొందరు అంటుంటే, మరికొందరేమో ఇది ముమ్మాటికి పాకిస్తాన్ కెప్టెన్ వీడియోనేనని సోషల్ మీడియాలో వాదనలకు దిగుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version