అమెరికాలో కాల్పుల కలకలం.. ఆరుగురు దుర్మరణం

-

అమెరికాలో మరోసారి తుపాకీ మోత ప్రకంపనలు సృష్టించింది. కాలిఫోర్నియా రాష్ట్రంలోని విసాలియా​ సిటీలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ ఘటనలో ఆరుగురు మృత్యువాతపడ్డారు. మృతుల్లో ఓ మహిళతోపాటు ఆమె ఆరు నెలల చిన్నారి ఉన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు.

ఉదయం 3.30 గంటల సమయంలో ఓ ఇంట్లో కాల్పులు జరుగుతున్నాయనే సమాచారం వచ్చిందని తులారే కౌంటీ అధికారి షెరిఫ్​ వెల్లడించారు. వెంటనే అప్రమత్తమై వెళ్లగా.. ఆ ఇంట్లో ఐదు మృతదేహాలను గుర్తించామని.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డట్టు తెలిపారు. ఆ వ్యక్తి ఆస్పత్రికి తీసుకెళ్లిన కాసేపటికి మరణించాడని చెప్పారు.

కాగా, ఈ దారుణానికి పాల్పడిన ఇద్దరు అనుమానితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇవి సాధారణంగా జరిగిన హత్యలు కావని.. ఓ కుటంబాన్ని టార్గెట్​ చేసుకుని హత్యచేశారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version