తెలంగాణ తెదేపా నేతలతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. తెలంగాణలో అసెంబ్లీ రద్దు, రాజకీయ కారణాలపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం. దాదాపు 9 నెలల సమయం ఉన్నప్పటికీ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎందుకు రద్దు చేశారు, కేంద్ర పట్ల ఆయన వైఖరిని తెలంగాణ ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. తెలంగాణలో పొత్తుల వ్యవహారంపై బాబుతో నేతలు ప్రస్తావించగా త్వరలోనే నిర్ణయం తీసుకుందామని ఆయన తెలిపారు. పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయాల్సిందిగా ఆయన సూచించినట్లు తెలుస్తోంది.