వైద్యుల నిర్లక్ష్యం.. కడుపులోనే పసికందు మృతి

-

ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తల్లి కడుపులోనే పసికందు మృతి చెందింది. ఈ ఘటన వరంగల్‌లోని పాలకుర్తి మండలం లక్ష్మీనారాయణ పురం గ్రామంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. గ్రామానికి చెందిన యాట భిక్షపతి తన భార్య అర్చన (గర్భిణి) తీసుకుని మొదటి కాన్పు కోసం పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు.

రెండు రోజుల క్రితం తీసుకురాగా నార్మల్ డెలివరీ చేస్తామని వైద్యులు ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకున్నారు. తీరా ఆమె పరిస్థితి విషమించడంతో ఎక్కడైనా మీకు నచ్చిన ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినట్లు తెలిసింది.

దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన మండల కేంద్రలోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే కడుపులోని పసికందు మృతి చెందిందని పేర్కొన్నారు. దీంతో అర్చన కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఆవరణలో పసికందు మృతదేహంతో బైఠాయించారు.అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొనగా.. పాలకుర్తి ఎస్ఐ పవన్ కుమార్ హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని పరిస్థితిని సద్దుమణిగేలా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news