నేషనల్ హెరాల్డ్ స్కాం కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఈడీ నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని కోరడంతో పాటు చార్జిషీటులో వారి పేర్లను నమోదు చేసింది. దీనిని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఈడీ ఆఫీసుల ఎదుట నిరసనలకు కాంగ్రెస్ అధినాయకత్వం పిలుపునిచ్చింది.
అయితే, నిన్న తెలంగాణ పీసీసీ చీఫ్ అందుబాటులో లేకపోవడంతో నేటికి ఆ ప్రొగ్రామ్ వాయిదా వేశారు. ఈ క్రమంలోనే గురువారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయం ఎదుట భారీ నిరసనకు టీపీసీసీ చీఫ్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరుకాబోతున్నారనే సమాచారం మేరకు పోలీసు ఉన్నతాధికారులు ఈడీ కార్యాలయం ఎదుట భారీగా పోలీసులను మోహరించారు.ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుండా తగు జాగ్రత్తలు చేపట్టారు.