కుక్క నాకితే మనిషి చనిపోతాడా? లాలాజలం ప్రాణాంతకం తెలుసా?

-

ఈరోజుల్లో చాలామందికి కుక్కలను పెంచుకోవటం అలావటైపోయింది. దాదాపు అన్ని ఇళ్లల్లో కుక్కలు ఉంటున్నాయి. ఎంతో ప్రేమగా ఎత్తుకుని, ముద్దాడుతూ ఉంటారుకదా, ఇంకొంతమందికి అసలు కుక్కలంటేనే పడదు. వాటిని చూస్తేన భయం వేస్తేంది..మరికొందరైతే అస్సలు దగ్గరకు కూడా రానీయ్యరు. కుక్కలను పెంచుకునే వాళ్లు చాలావరకూ దాన్ని ఎత్తుకుంటారు, ఆ కుక్క మీద పడి నాకుతున్న ప్రేమతో అలా చేస్తుందని ఏమి అనరు. ఇదంతా ఈ కుక్కలంటే ఇష్టంలేని బ్యాచ్ ఉంది చూశారు..వారికి భలే ఇరిటేటింగ్ గా అనిపిస్తుందిలే..అయితే ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే..కుక్కలు అలా మనిషిని నాకటం మంచిదేనా, అది ప్రాణంతకం అంటున్నారు కొందరు నిపుణులు ఏంటో ఇప్పుడు చూద్దాం.

గతంలో తన పెంపుడు కుక్క నాకడంతో ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్ సోకి జర్మనీకి చెందిన ఓ వ్యక్తి చనిపోయారు కూడా. ఇదే విషయాన్ని ‘యూరోపియన్ జర్నల్ ఆఫ్ కేస్ రిపోర్ట్స్ ఇన్ ఇంటర్నల్ మెడిసిన్‌’ వెల్లడించింది. కుక్కలు, పిల్లుల లాలాజలంలో క్యాప్నోసైటోఫాగా కానిమోర్సస్ అనే బ్యాక్టీరియా ఉంటుందట. కుక్క, పిల్లి కరవడం వల్ల ఆ బ్యాక్టీరియా సోకిన కేసులు అప్పుడప్పుడూ వెలుగులోకి వస్తుంటాయి కూడా. కానీ, జర్మనీకి చెందిన ఓ 63 ఏళ్ల వ్యక్తి కుక్క కరవకున్నా ఆ బ్యాక్టీరియా సోకి చనిపోయారు.

మూడు రోజుల పాటు తీవ్రమైన జ్వరం, కండరాల నొప్పులతో బాధపడిన తర్వాత ఆయన ఆస్పత్రిలో చికిత్సపొందారు. ఆయన ముఖం, చేతుల మీద బొబ్బలు, ఎర్రని మచ్చలు వచ్చాయి. శరీరం లోపల కూడా అనేక అవయవాలు దెబ్బతిన్నాయి. కాలేయం పనిచేయడం ఆగిపోయిందట, అదికాస్తా కార్డియాక్ అరెస్ట్‌కు దారితీసింది. దాంతో, ఆస్పత్రిలో చేరిన తర్వాత 16 రోజులకు ఆయన మరణించారు.

అయితే కొన్ని వారాల కింద ఆయనను పెంపుడు కుక్క నాకింది కానీ ఎలాంటి గాయం చేయలేదని జర్నల్‌లో పేర్కొన్నారు. దీనిని బట్టి, కుక్కలు, పిల్లులు నాకినా కొన్నిసార్లు ప్రమాదకరంగా మారొచ్చని తేలింది.

కొన్నిసార్లు కుక్క కరవకపోయినా, గాయాలున్న చోట అది నాకితే దాని లాలాజలంలోని బ్యాక్టీరియా మనకు సంక్రమించవచ్చే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు. అయితే, ఈ బ్యాక్టీరియా ప్రాణాంతకంగా మారిన కేసులు తక్కువే కానీ, రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారి మీద దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని వైద్యులు అంటున్నారు.

తీవ్రమైన ఇన్ఫెక్షన్‌తో బాధపడేవారిలో దాదాపు 30 శాతం మంది చనిపోయే అవకాశం ఉందని సీడీసీ తెలిపింది. గుండె పోటు, మూత్రపిండాలు పనిచేయకపోవడం, గ్యాంగ్రీన్ అంటే రక్తసరఫరా ఆగిపోయి కణాలు చనిపోవడం లాంటి తీవ్రమైన సమస్యలకు కూడా దారితీసే ప్రమాదం ఉంటుందని వెల్లడించారు. ఎక్కువగా 40 ఏళ్లకు పైబడిన వారికి ఈ బ్యాక్టీరియా సోకుతుందని, కొన్ని కేసుల్లో చిన్న పిల్లలు కూడా ఉంటున్నారని, గర్భిణుల మీద కూడా దీని ప్రభావం అధికంగా ఉండొచ్చని సీడీసీ పేర్కొంది.

లక్షణాలు ఇలా ఉంటాయట:

చాలామందిలో ఈ బ్యాక్టీరియా సోకిన తర్వాత 3-5 రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో 14 రోజుల వరకూ దాని లక్షణాలు బయటపడకపోవచ్చు.

చర్మంపై వాపులు రావడం, ఎర్రని మచ్చలు ఏర్పడటం, జ్వరం, వాంతులు, తలనొప్పి, మోకాళ్ల నొప్పులు ,కడుపు నొప్పి, నీళ్ల వీరేచనాలు, కండరాల నొప్పి,లాంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఒకవేళ కుక్క నాకిన తర్వాత ఈ లక్షణాలు ఉంటే తక్షణమే వైద్యులను సంప్రదించాలి. తొందరగా చికిత్స ప్రారంభిస్తే యాంటీబయోటిక్ మందులతో నయం చేసుకోవచ్చు.

కుక్కలను ప్రేమగా చూసుకోవడంలో తప్పులేదు. కానీ అతి ప్రేమ చేయకూడదు. పెంపుడు కుక్కలతోనూ జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా చిన్నారులను కుక్కలు నాకడం, గీరడం లాంటివి ఎక్కువగా చేస్తుంటాయి. ఈ బ్యాక్టీరియాను నిరోధించే టీకాలు కూడా లేవని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి కుక్కల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి..ఓ మీద వేసుకుని లేనిపోని సమస్యలు తెచ్చుకోకండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version