Shyam Singha Roy: రానా నో అంటే.. నాని ఓకే అన్నార‌ట‌!

-

Shyam Singha Roy: శ్యామ్ సింగరాయ్.. టాక్సీవాలా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న డైరెక్ట‌ర్ రాహుల్ సాంకృత్యాన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం. ఈ చిత్రంలో నేచురల్ స్టార్ నాని హీరోగా న‌టిస్తున్నారు. విభిన్నమైన కథాంశంతో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో నాని డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నాడు. ఈ చిత్రంలో నాని స‌ర‌స‌న సాయి పల్లవి, మడోన్నా సెబాస్టియన్, కృతి శెట్టి న‌టించ‌నున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టైటిల్ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే..ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త టాలీవుడ్ లో వైర‌ల్ అవుతుంది.

ఈ సినిమాలో ముందుగా నాని ని హీరోగా అనుకోలేదట.. నాని కంటే ముందు ద‌గ్గుపాటి రానా ను హీరోగా భావించార‌ట‌. తొలుత‌ సినిమా స్క్రిప్ట్ ను రానా కు వినిపించగా.. రానా సున్నితంగా తిరస్కరించారట. ఈ స్టోరీ నానికి సెట్ అవుతుంద‌ని చెప్పార‌ట‌. ఆ స‌ల‌హా మేర‌కు .. ఆక‌థ‌ను నానికి వినిపించ‌డంతో .. క‌థ బాగా నచ్చింద‌ని చెప్పారట‌. ఇంకేముందీ వెంట‌నే సినిమాను పట్టాలపైకి వెళ్ళిందట. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. క్రిస్మస్ కానుకగా ఈ చిత్రం డిసెంబర్ 24న తెలుగు తమిళ మలయాళ కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version