ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా హైలెట్ అవుతున్నాయి. చాలా వరకు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పనితనాన్ని తెలుసుకోవడానికి వస్తున్నారు కూడా. ఎక్కడా కూడా ప్రతిపక్షాలకు చాన్స్ ఇవ్వకుండా ప్రజలను సంతృప్తిపరుస్తూ పరిపాలనలో దూసుకుపోతున్నారు వైయస్ జగన్. దీంతో దేశంలోనే ప్రజల చేత ప్రేమించబడుతున్న ముఖ్యమంత్రిగా మూడవ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. అంతే కాకుండా జాతీయ స్థాయిలో ఉన్న మీడియా అయితే వైయస్ జగన్ సౌత్ ఇండియాలో తిరుగులేని పొలిటికల్ స్టార్ అని..త్వరలోనే దేశ రాజకీయాలు ఆయన చుట్టూ తిరుగుతాయి అంటూ కథనాలు కూడా ప్రసారం చేస్తుంది.
అమరావతి మెట్రోపాలిటన్ కార్పొరేషన్ ఏర్పాటు పేరుతో రాజధాని గ్రామాల్లో ఎన్నికలు నిలిపివేయాలని పంచాయతీరాజ్ శాఖ కూడా కోరింది. వీటికి ఎస్‌ఈసీ కూడా ఆమోదం తెలపింది. దీంతో అమరావతి ప్రాంతంలో ఓటమి భయంతోనే వైయస్ జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని..తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రచారం చేయడం స్టార్ట్ చేశారు. ఇటువంటి నిర్ణయం వల్ల ఒక నియంత అనే ముద్ర జగన్ పరిపాలన పై పడుతుందని రాజకీయ విశ్లేషకులు మరోపక్క అంటున్నారు.