ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ హెచ్‌డిఎఫ్‌సి కస్టమర్లకు బ్యాడ్ న్యూస్..మార్జిన్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్‌ను 0.20 శాతం పెంచింది..మే తర్వాత బ్యాంకు రుణంపై వడ్డీని పెంచడం ఇది మూడోసారి. మే నుంచి HDFC మొత్తం వడ్డీ రేటు 0.80 శాతం పెరిగింది. దీనివల్ల రుణాల వడ్డీ రేట్లు గణనీయంగా పెరగనున్నాయి. HDFC బ్యాంక్ ఒక సంవత్సరం కాలానికి MCLR ఇప్పుడు 8.05 శాతంగా ఉంది. ఇది గతంలో 7.85 శాతంగా ఉంది..
ఇది ఇలా ఉండగా..ఓవర్‌నైట్ రుణాలపై వడ్డీరేటు 7.50 నుంచి 7.70 శాతానికి పెరుగుతుంది. నెల రోజుల టెన్యూర్ గల రుణంపై వడ్డీరేటు 7.75, మూడు నెలల గడువు గల రుణంపై వడ్డీరేటు 7.80, ఆరు నెలల టెన్యూర్ గల రుణంపై 7.90 శాతం వడ్డీరేటు విధించనుంది. ఏడాది టెన్యూర్ రుణాలపై వడ్డీ 8.05, రెండేండ్ల గడువు రుణంపై 8.15, 3 ఇయర్స్ గల 8.25 శాతం వడ్డీరేటు వసూలు చేయనుంది.