ఆ బ్యాంక్ కస్టమర్స్ కి బ్యాడ్ న్యూస్.. లోన్లపై వడ్డీ రేట్లు పెంపు..!

-

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్స్ కి బ్యాడ్ న్యూస్ చెప్పింది. బెంచ్‌మార్క్ లెండింగ్ రేటును 5 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్టు తెలిపింది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్. మరి ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. అయితే దీనిని పెంచడం వలన ప్రస్తుత రుణ గ్రహీతలకు ఈఎంఐలు మరింత పెరగనున్నాయి.

ఇక ఇది ఇలా ఉంటే ఇప్పటికే స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా అలానే బ్యాంకు ఆఫ్ బరోడా బ్యాంకులు కూడా లెండింగ్ రేట్లను పెంచాయి. అయితే హెచ్‌డీఎఫ్‌సీ కూడా తన లెండింగ్ రేట్లను ఇతర లెండార్ల రేట్ల పెంపుకు అనుగుణంగా పెంచేసింది. హౌసింగ్ లోన్ల పై రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటు ని పెంచింది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్. దీంతో బెంచ్‌మార్కు చేయబడ్డ దాని అడ్జెస్టబుల్ రేటు హోమ్ లోన్లు ఐదు బేసిస్ పాయింట్లు పెరిగాయి.

ఈ రేట్లు మే 1, 2022 నుంచి అమలు లోకి వచ్చాయి. ఈ విషయాన్ని కంపెనీ తన ప్రకటనలో చెప్పింది. అయితే దీనితో 750 పైన క్రెడిట్ స్కోర్ ఉన్న కస్టమర్లకు హెచ్‌డీఎఫ్‌సీ హోమ్ లోన్ అడ్జెస్టబుల్ రేటు అంతకు ముందు 6.70 శాతం ఉంటే ఇప్పుడు అది 6.75 శాతానికి పెరిగింది. ఇది ఇలా ఉండగా కొత్త రుణ గ్రహీతలకు మాత్రం లెండింగ్ రేట్లను ఏమి మార్చలేదు. అయితే కొత్త రుణ గ్రహీతలకు వడ్డీ రేట్లు వారు తీసుకునే క్రెడిట్, లోన్ మొత్తం బట్టి 6.70 శాతం నుంచి 7.15 శాతం మధ్య లో వుండనున్నాయి.

ఇక చార్జెస్ విషయం లోకి వస్తే.. రూ.30 లక్షల వరకు లోన్ ఉంటే 6.85 శాతం వడ్డీ తీసుకోనుంది. రూ.30 లక్షల నుంచి రూ.75 లక్షల మధ్యలో లోన్లకు 7.10 శాతం, రూ.75 లక్షల పైన రుణం ఉన్న వారికి 7.20 శాతం పడుతుంది. అదే మహిళా కస్టమర్లకు వడ్డీ రేట్లు 5 బేసిస్ పాయింట్లు తక్కువ.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news