కరోనా ప్రభావం లాక్ డౌన్ ఎఫెక్ట్ టాలీవుడ్ ఇండస్ట్రీని నష్టాల్లోకి నెట్టేసింది. మామూలుగా అయితే సినిమా ఇండస్ట్రీకి వేసవి కాలం మంచి సీజన్. ఈ సీజన్ ని టార్గెట్ చేసుకుని చాలామంది స్టార్ హీరోలు మరియు డైరెక్టర్లు సినిమాలు నిర్మిస్తుంటారు. కానీ కరోనా వైరస్ రాకతో ఈ వేసవికి విడుదల కావాల్సిన సినిమాలు మొత్తం ఆగిపోయాయి. ఈ వైరస్ ఎఫెక్టుతో సినిమాలు నిర్మించిన నిర్మాతలు వడ్డీల మీద వడ్డీలు బ్యాంకులకు కడుతూ అనేక కష్టాలు పడుతున్నారు.
ఈ విధంగా చేయడం వల్ల రాబోయే రోజుల్లో థియేటర్ వ్యాపారాన్ని కాపాడుకునే వాళ్ళం అవుతామని అంటున్నారు. ఈ ఏడాది చివరి లోపు వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉండటంతో ఇండస్ట్రీ పెద్దలు తీసుకున్న ఈ నిర్ణయాన్ని చాలామంది సమర్ధిస్తున్నారు. మరో పక్క ఆరు నెలలు అంటే లాంగ్ టైం పిరియడ్, దసరా సీజన్ పోతుంది…చాలా పండుగలు మిస్ అయిపోతాం భయంకరమైన లాస్ వస్తుందని మరి కొంతమంది అంటున్నారు. లాక్ డౌన్ ఎత్తేసిన తరువాత కూడా ఆరు నెలలు నిజంగా క్లోజింగ్ అయితే ఖచ్చితంగా మల్టీప్లెక్స్ థియేటర్ల యజమానులకు ఇది బ్యాడ్ న్యూసే.