కవితకు బెయిల్ నిరాకరణ.. సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్న కవిత..?

-

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్‌లో భాగంగా తీహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, సీబీఐ కేసుల్లో కవిత బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేయగా.. ట్రయల్ కోర్టుతో పాటు ఢిల్లీ హైకోర్టులోనూ ఆమెకు ఊరట దక్కలేదు. దర్యాప్తు సంస్థల వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానాలు కవితకు బెయిల్ నిరాకరిస్తూ జూలై 1వ తేదీన ఢిల్లీ హై కోర్టు తీర్పు వెలువరించింది.

ఈ క్రమంలో బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కవిత నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కవిత సోదరుడు కేటీఆర్, బావ హరీష్ రావు ఢిల్లీకి చేరుకొని ఉదయం తీహార్ జైలులో కవితతో ములాఖాత్ అయ్యారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంపై ముగ్గురు చర్చించి.. సుప్రీంకోర్టుకి వెళ్లాలని డిసైడ్ అయినట్లు టాక్. ఈ నేపథ్యంలో కేటీఆర్, హరీష్ రావు సుప్రీం కోర్టులో దాఖలు చేయనున్న బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీలో న్యాయ నిపుణుల బృందంతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version