హీరో నాగశౌర్య తండ్రి శివలింగ ప్రసాద్‌కు బెయిల్

-

టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య తండ్రి.. శివలింగ ప్రసాద్ ఇవాళ మధ్యాహ్నం.. అరెస్టయిన సంగతి తెలిసిందే. శివలింగ ప్రసాద్ ను అరెస్ట్ చేసిన పోలీసులు ఉప్పరపల్లి కోర్టు లో హాజరుపరిచారు. ఈ సందర్భంగా శివప్రసాద్ తరపు న్యాయవాది ఉప్పరపల్లి కోర్టు లో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

శివలింగ ప్రసాద్ వయస్సు, అలాగే ఆయన ఆరోగ్య పరిస్థితుల విషయలను ఈ సందర్భంగా కోర్టుకు తెలిపారు ఆయన తరఫు లాయర్. అలాగే శివ లింగ ప్రసాద్ ఆరోగ్యానికి సంబంధించిన మెడికల్ సర్టిఫికేట్ లు కూడా కోర్టుకు అందజేశారు ప్రసాద్ తరఫు లాయర్. అయితే వీటన్నిటినీ పరిశీలించిన ఉప్పరపల్లి కోర్టు… ఎట్టకేలకు శివలింగ ప్రసాద్ కు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు పూర్తి అయ్యేవరకు హైదరాబాద్ మహానగరం దాటి వెళ్ళకూడదని ఆంక్షలు విధిస్తూ బెయిల్ మంజూరు చేసింది ఉప్పరపల్లి కోర్ట్. కోర్టు నిర్ణయం తో యంగ్ హీరో నాగ శౌర్య కుటుంబానికి కాస్త ఊరట కలిగింది. కాగా మంచి రేవుల పేకాట కేసు లో శివలింగ ప్రసాద్ ను అరెస్ట్ చేశారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version