అంబులెన్స్‌లో సిలిండర్ పేలుడు… తృటిలో తప్పించుకున్న ఓ గర్భిణీ..!

-

అంబులెన్స్‌లో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. అయితే… తృటిలో ఓ గర్భిణీ, ఆమె కుటుంబం తప్పించుకుంది. ఈ సంఘటన మహారాష్ట్ర లో జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్ర జల్గావ్ జిల్లాలోని దాదావాడి సమీపంలోని జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది.

Pregnant Woman Has Narrow Escape As Oxygen Cylinder In Ambulance Explodes In Maharashtra

అంబులెన్స్‌లో గర్భిణీని తన కుటుంబం జల్గావ్ జిల్లా ఆసుపత్రికి తీసుకువెళుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. అంబులెన్స్‌లో ఉన్న ఆక్సిజన్‌ సిలిండర్‌ పేలడంతో..అంబులెన్స్‌లో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. ఈ పేలుడు ధాటికి సమీపంలోని ఇళ్ల అద్దాలు కూడా పగిలిపోయినట్లు సమాచారం. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అంటున్నారు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version