కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి బెయిల్ మంజూరు..

-

ఎమ్మెల్యే కోటంరెడ్డి తనపై దౌర్జ్యనం చేసి బెదిరించారని నెల్లూరు జిల్లా వెంకటాచలం మహిళా ఎంపీడీవో పోలీస్ స్టేషన్ ముందు శుక్రవారం అర్ధరాత్రి దీక్ష చేశారు. ఈ నెల ఒకటో తేదీన ఎమ్మెల్యే కోటంరెడ్డి ఫోన్‌లో బెదిరించారని, శుక్రవారం రాత్రి కల్లూరుపల్లిలోని తన నివాసానికి వచ్చి కుటుంబసభ్యులను బెదిరించారని ఎంపీడీవో ఫిర్యాదులో తెలిపారు. ఈ క్ర‌మంలోనే నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని పోలీసులు ఆదివారం ఉదయం అరెస్ట్ చేశారు. అయితే ఎంపీడీవో సరళ ఇంటిపై దౌర్జన్యం కేసులో వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి బెయిల్ మంజూరైంది.

వైద్య పరీక్షల కోసం కోటంరెడ్డిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులు మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపర్చారు. విచారణ జరిపిన న్యాయమూర్తి కోటంరెడ్డికి బెయిల్ మంజూరు చేశారు. కాగా ఎమ్మెల్యే కోటంరెడ్డి, ఆయన అనుచరుడు శ్రీకాంత్‌రెడ్డిపై.. 290, 506, 448, 427 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version