అక్క‌ను టెన్ష‌న్ పెట్టేస్తోన్న వైసీపీ యంగ్ లీడ‌ర్‌…?

-

రాయ‌ల‌సీమ‌కు చెందిన కీల‌క నాయ‌కుడు, ప్ర‌స్తుతం బీజేపీలో ఉన్న‌ బైరెడ్డి రాజ‌శేఖ‌ర‌రెడ్డికి కుమార్తె భ‌విత‌వ్యంపై బెంగ ప‌ట్టు కుం దా? తాను న‌మ్మి రాజ‌కీయాల్లోకి తీసుకువ‌చ్చిన త‌న త‌మ్ముడి కుమారుడి వ్య‌వ‌హారం భ‌య పెడుతోందా? అంటే ఔన‌నే అంటు న్నారు ప‌రిశీల‌కులు. రాజ‌కీయంగా దూకుడు ప్ర‌ద‌ర్శించే బైరెడ్డికి అనుకున్న విధంగా గుర్తింపు ల‌భించ‌లేద‌నేది వాస్త‌వం. గ‌తంలో ఆయ‌న రాజ‌కీయం టీడీపీతో ప్రారంభ‌మైంది. అయితే, ప్ర‌త్యేక రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో ఆయ‌న ప్ర‌త్యేక సీమ‌ను డిమాండ్ చే స్తూ.. అదే సమ‌యంలో చంద్ర‌బాబు వైఖ‌రిని త‌ప్పుప‌డుతూ.. పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు.

ఇక‌, సొంత‌గా ప్ర‌త్యేక సీమ హ క్కుల పోరాట స‌మితిని ఏర్పాటు చేశారు. పాద‌యాత్ర చేశారు. పార్టీ పెట్టుకున్నారు. అయితే, ఎక్క‌డా కూడా బైరెడ్డి స‌క్సెస్ కాలేదు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న అరెస్ట‌యి జైలుకు కూడా వెళ్లారు. ఈ స‌మ‌యంలో ఆయ న కుమార్తె శ‌బ‌రి బ‌య‌ట‌కు వ‌చ్చారు. త‌న తండ్రి పార్టీని లీడ్ చేశారు. అయితే, ఆమె కూడా పుంజుకోలేదు. ఇక‌, గ‌త ఏడాది ఎ న్నిక‌ల త‌ర్వాత వైసీపీ తీర్థం పుచ్చుకుంటార‌నే ప్ర‌చారం జ‌రిగింది. అయితే, గ‌తంలో వైఎస్ జ‌గ‌న్‌తో ఉన్న విభేదాల కార‌ణంగా ఆయ‌న పార్టీకి దూరంగా ఉన్నారు.

ఈ క్ర‌మంలోనే త‌న పార్టీని విలీనం చేస్తూ.. బీజేపీలోకి చేరిపోయారు. అదేస‌మ‌యంలో త‌న త‌మ్ముడు కుమారుడు బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డిని కూడా రాజ‌కీయాల్లోకి తీసుకువ‌చ్చారు. ఇక‌, క‌ర్నూలు జిల్లా నందికొట్కూరు ని యోజ‌క‌వ‌ర్గంలో హ‌వా ప్ర‌ద‌ర్శించిన బైరెడ్డికి ఇప్పుడు అటు త‌మ్ముడు కుమారుడు సిద్ధార్థ‌రెడ్డితోనూ ఇటు కుమార్తె శ‌బ‌రి విషయంలోనూ రాజ‌కీయంగా త‌ల‌ప‌ట్టుకునే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. విష‌యం ఏంటంటే.. త‌న కుమార్తె శ‌బ‌రిని వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయించి గెలిపించుకోవాల‌ని బైరెడ్డి వ్యూహం. అయితే, ఇక్క‌డ త‌న త‌మ్ముడు కుమారుడు అనూహ్యంగా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో వైసీపీ త‌ర‌ఫున ఇక్క‌డ ఆయ‌న పుంజుకు న్నారు.

ఇప్పుడు వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి సిద్ధార్థ రెడ్డే త‌న కుమార్తె శ‌బ‌రికి పోటీ అవుతార‌ని బైరెడ్డి భావిస్తున్నారు. శ‌బ‌రి దూకుడు లేకుండా ఉండడం, బీజేపీ ఎంత పాకులాడినా పుంజుకోలేక పోవ‌డం, మ‌రోప‌క్క సిద్ధార్థ‌రెడ్డి దూకుడు ప్ర‌ద‌ర్శించ‌డం వంటి ప‌రి ణామాల నేప‌థ్యంలో ప్ర‌జ‌ల మొగ్గు కూడా సిద్ధార్థ‌వైపే ఉంది. దీంతో శ‌బ‌రి పుంజుకోవ‌డం క‌ష్ట‌మేన‌ని బైరెడ్డి భావిస్తున్నారు. ఇదిలావుంటే , సిద్ధార్థ రెడ్డి రోజు రోజుకు ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న హ‌వాను త‌ట్టుకుని త‌మ రాజ‌కీయం సాగించ‌గ‌ల‌మా? అని బైరెడ్డి ఆలోచ‌న‌లో ప‌డ్డారు. సో.. బైరెడ్డి రాజ‌కీయాలు ఇలా ఉన్నాయ‌న్న మాట‌!

Read more RELATED
Recommended to you

Exit mobile version