“వై ఎస్ కమ్మోళ్ళ నాయకుడు” అసంబ్లీ లో కుండ బద్దలు కొట్టేసిన ఎమ్మెల్యే !

-

అమరావతి నుండి రాజధానిని తొలగించేసి వైయస్ జగన్ చంద్రబాబు సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గాన్ని ఆర్థికంగా దెబ్బ కొట్టాలని చూస్తున్నారని తెలుగుదేశం పార్టీకి అండగా ఉండే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా తనని తన కుటుంబాన్ని కమ్మ కులానికి వ్యతిరేకిగా చిత్రీకరిస్తున్నారని అసెంబ్లీలో మాట్లాడిన జగన్ తనకు అత్యంత సహచరులలో ఉన్నవాళ్లలో ఉన్నది ఎక్కువగా కమ్మ కులస్తులు అని క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే ఇటువంటి తరుణంలో తాజాగా కమ్మ కులానికి చెందిన దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి వైయస్ మొదటి నుండి కమ్మ సామాజిక వర్గానికి పెద్దపీట వేశారని అంటూ అసెంబ్లీలో కుండబద్దలు కొట్టే విధంగా క్లారిటీ ఇచ్చారు.

కమ్మ కులం అంటే కేవలం తెలుగుదేశం పార్టీ అన్నట్టుగా చంద్రబాబు మరియు ఆయన భజన పత్రికలు వ్యవహరిస్తున్నాయని టిడిపి పార్టీ కూడా అదేవిధంగా భావించడం సిగ్గుచేటు అంటూ అబ్బయ్య చౌదరి సీరియస్ అయ్యారు. కమ్మ కులంలో కూడా వైసీపీ అభిమానులు ఉన్నారని తమ కుటుంబమే దానికి నిదర్శనం అంటూ అబ్బయ్య చౌదరి పేర్కొన్నారు. తమ కుటుంబ సభ్యులంతా 1985 నుండి వైయస్ రాజశేఖర్ రెడ్డి ని తమ నాయకుడిగా భావించామని…ప్రజల సంక్షేమం కోసం నీతిగా నిజాయితీగా వ్యవహరించే రాజకీయ నాయకుడి వెంటే తమ కుటుంబం ఉందని అంతేగాని ఒక కులానికి చెందిన వారమని ఒక పార్టీకి మేము ఎప్పుడూ పరిమితం కాలేదని అలాంటి వారు కమ్మ సామాజిక వర్గం లో లేరని వైయస్ రాజశేఖర్ రెడ్డి కమ్మ వాళ్ళ నాయకుడని పేర్కొన్నారు.

 

తన స్వార్ధ రాజకీయాలకోసం కమ్మ కులస్తులను చంద్రబాబు అన్యాయంగా వాడుకున్నారని అటువంటి దిక్కుమాలిన రాజకీయాలు చేయడం చంద్రబాబుకే సాధ్యమంటూ అబ్బయ్య చౌదరి విమర్శించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైయస్ జగన్ అన్ని కులాలను మతాలను సమానంగా చూస్తున్నారని కమ్మ కులస్తుల కోసం త్వరలోనే జగన్ కమ్మ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు అబ్బయ్య చౌదరి క్లారిటీ ఇచ్చారు. అగ్ర వర్ణాలలో కూడా పేదరికం ఉండటంవల్ల జగన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు అబ్బాయి చౌదరి పేర్కొన్నరు.  

Read more RELATED
Recommended to you

Exit mobile version