కలలు నెరవేర్చుకునేందుకు కొంతమంది ఎంతటి కష్టాలైన ఎదుర్కొంటారు. తమ కలను నెరవేర్చకుంటారు. ఇలాంటి ఓ యువకుడి కథే ఇది. తాను కలల బైక్ కొనేందుకు ఆ యువకుడు చేసిన పనిని చూస్తే షాక్ తినాల్సిందే. తమిళనాడు సేలం కు చెందిన ఓ యువకుడు ఏకంగా మూడేళ్ల పాటు ఒక రూపాయి నాణేలు సేకరించాడు.
ఇటీవల శనివారం తన రూ. 2.6 లక్షల నాణేలను గోనె సంచుల్లో మూటగా చేసి ఓ మిని వ్యాన్ లో షోరూంకు తీసుకెళ్లాడు. భూపతి అతని నలుగురు స్నేహితులతో పాటు ఐదుగురు షోరూం సిబ్బంది ఈ నాణేలను లెక్కిండానికి ఏకంగా 10 గంటల సమయం పట్టింది. మొదటగా బీసీఏ గ్రాడ్యుయేట్ అయిన 29 ఏళ్ల భూపతి కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్నాడు. మూడేళ్ల నుంచి తన ఆదాయంలో కొంత భాగాన్ని నాణేలుగా మారుస్తున్నాడు. అయితే మొదటగా భూపతి నుంచి నాణేలు సేకరించడానికి ఇష్టపడలేదని… కానీ భూపతిని నిరాశపరచకూడదని స్వీకరించాం అని షోరూం మహావిక్రాంత్ వెల్లడించారు.