బాలయ్య షోలో మ‌హేశ్ కు ప్ర‌శంస‌లు! ఎందుకంటే?

-

మ‌నుష్యులందు నీ క‌థ మ‌హ‌ర్షిలాగా సాగ‌దా! అంటూ పాటందుకున్నాడు మహేశ్..ఈ పాట నేప‌థ్య గీతంగా వినిపిస్తుంది. జీవితాల‌ను మ‌రింత ప్ర‌కాశ‌వంతం చేస్తూ పోనుంది కూడా! ఊరిని ద‌త్త‌త తీసుకున్న కాన్సెప్ట్ ద‌గ్గ‌ర నుంచి మ‌హేశ్ ప్ర‌జ‌ల‌కు క‌నెక్ట్ అయ్యాడు.ఆ క‌నెక్టివిటీకి కొనసాగింపుగానే సినిమా జీవితం ఇంకాస్త ముందుకు వెళ్తోంది.వ్య‌క్తిగ‌త జీవితంలో కూడా ఉన్న ఒడిదొడుకుల కార‌ణంగానే తాను ఇంకొంద‌రికి సాయం చేయాల‌న్న ఆలోచ‌న‌కు వ‌చ్చానన్న మహేశ్ ముందున్న కాలంలోనూ
ఇంకొంద‌రికి మాన‌వతా దృక్ప‌థంతో ఆదుకోవాల‌ని ఆశిద్దాం.

మ‌నుషుల్లో క‌థ ఉంది..మ‌నుషుల్లో మాయ‌ని గాయం కూడా ఉంది..ఉంటుంది.వెతికి తీసే వేళ కొన్ని వేల వేద‌న‌లు ఎదుర‌యి నిలుస్తాయి.బాధిత కుటుంబాల‌కు వెలుగు పంచేందుకు కొన్ని తార‌లు ముందుకు వ‌స్తాయి.అవి త‌మ‌వంతు సాయం చేసి దీవెన‌లు అందించి జీవితాల్లో పండుగ సంతోషాలు సుస్థిరం చేయాల‌ని ప‌రిత‌పిస్తాయి.పండుగ త‌రువాత పండుగంటి ఆనందాలు ఇంకా మిగిలే ఉన్నాయి అని చెబుతున్నారు బాల‌య్య..ఎంత‌గానో అభినందిస్తూ మహేశ్ చేప‌ట్టిన ప‌నుల‌కు పొంగిపోయారు. కొద్దిసేపు ఏం మాట్లాడాలో కూడా తెలియ‌ని స్థితిలో బాల‌య్య ఉండిపోయారు.ఇవీ బాల‌య్య – మ‌హేశ్ కు సంబంధించి ఆహా ప్రోమో విశేషాలు..ఇంకొన్ని కూడా ఉన్నాయి చ‌ద‌వండిక.

వెయ్యికి పైగా ప‌సి హృద‌యాల్లో చోటు ద‌క్కించుకున్న ప్రిన్స్ మ‌హేశ్ బాబును ప్ర‌త్యేకంగా ప్ర‌శంసించారు బాల‌య్య.ఆయ‌న చూపిన చొర‌వ,హృద్రోగంతో బాధ‌ప‌డుతున్న చిన్నారుల‌కు అండ‌గా నిలిచి,ఆపరేష‌న్లు చేయించి మాన‌వ‌త‌కు నిలువెత్తు నిద‌ర్శ‌నంగా నిలిచిన వైనంపై బాలయ్య క‌దిలిపోయారు.ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం ఆహాలో అన్ స్టాప‌బుల్ పేరిట నంద‌మూరి న‌టసింహం నిర్వ‌హించిన షో ఫైన‌ల్స్ కు చేరుకుంది.ఈ సంద‌ర్భంగా ఫైన‌ల్ ఎపిసోడ్ ప్రొమోను నిన్న‌టివేళ విడుద‌ల చేశారు.


ఈ ప్రొమోలో ఆస‌క్తిదాయ‌క విష‌యాలు వెల్ల‌డిచేశారు బాల‌య్య ద‌గ్గ‌ర మహేశ్ బాబు.ఎంట్రీనే డిఫ‌రెంట్ గా ప్లాన్ చేసి ఫిదా చేశారు అభిమానుల‌ను..! షో ఆరంభంలో పోకిరీ సినిమాలో ఎవ‌డు కొడితే మైండ్ బ్లాక్ అయిపోతుందో అత‌నే మ‌హేశ్ బాబు అని చెప్పి అల‌రించారు.అటుపై మ‌హేశ్ కెరియ‌ర్ కు సంబంధించి, కుటుంబానికి సంబంధించి ప్ర‌శ్న‌లు అడిగి ఆస‌క్తిక‌ర రీతిలో జ‌వాబులు రాబ‌ట్టారు.మ‌ధ్య,మ‌ధ్య‌లో పంచ్ లు అదిరిపోయాయి.అటు బాల‌య్య కానీ ఇటు మ‌హేశ్ కానీ పంచ్ ల మీద పంచ్ లు విసిరారు.సెటైరిక‌ల్ గా ఉన్నా షో మొత్తం ఆద్యంతం న‌వ్వులు పూయించింది. ఇదిగో ఆ షో ప్రోమో మ‌రోసారి మీ కోసం…..

Read more RELATED
Recommended to you

Exit mobile version