బాలకృష్ణ కి హీరోయిన్స్ లో అంత బ్యాడ్ నేమ్ ఉందా?  

-

నందమూరి బాలకృష్ణ వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. తండ్రి ఎన్టీ రామారావు జీవిత చరిత్రకు సంబంధించి తీసిన ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలు మరియు ఇటీవల రవికుమార్ దర్శకత్వంలో నటించిన రూలర్ సినిమా ఫ్లాప్ అవడంతో బోల్తా పడటంతో బాలకృష్ణ ఇమేజ్ ఒక్కసారిగా తగ్గి పోయింది. దీంతో చాలా మంది బాలకృష్ణ పక్కన నటించడానికి తెగ ఆలోచిస్తున్నారు.

ఇటువంటి నేపథ్యంలో బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ నటించబోయే మూడో సినిమా కోసం చాలామంది హీరోయిన్ల పేర్లు ఇప్పటికే వార్తలు వినపడ్డాయి. వాటిలో ఒకదాని పేరు కేథ‌రిన్. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడిన సందర్భంలో బాలకృష్ణ పక్కన బోయపాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై మీడియా ప్రశ్నించగా.. ‘‘బోయపాటి-బాలకృష్ణ సినిమాలో నేను నటిస్తున్నానంటూ చాలా చోట్ల వార్తలు వస్తున్నాయి.

దీని గురించి సోష‌ల్ మీడియాలో చాలా చ‌దివాను. అయితే ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే చాలా సీరియస్ గా ..మీడియాకి డైరెక్టర్ బోయపాటి అడ్డుకోండి…అని ఘాటుగా రిప్లై ఇచ్చింది. దీంతో  బాలకృష్ణ పేరు కూడా కేథ‌రిన్ ప్రస్తావించకపోవడం తో… బాలకృష్ణ కి హీరోయిన్స్ లో అంత బ్యాడ్ నేమ్ ఉందా? అని నెటిజన్లు ఈ మధ్యన ఆన్సర్ కి కౌంటర్ లు వేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version