వారి వల్లే ఆమె కాళ్లు పట్టుకున్న బాలకృష్ణ.. కారణం..?

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్వర్గీయ నందమూరి తారక రామారావు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాలకృష్ణ ప్రస్తుతం ఒకపక్క నటుడిగా బిజీగా ఉంటూ మరొక పక్క ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టి రెండింటినీ కూడా చాలా చక్కగా బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నారు.. అంతేకాదు తెలుగు ఆహా ఓటిటి వేదికగా అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కె అనే ఒక సెలబ్రిటీ షో ని కూడా నిర్వహిస్తూ మంచి టిఆర్పి రేటింగ్ ను కూడా సొంతం చేసుకుంటున్నారు బాలయ్య. ఇదిలా ఉండగా బాలయ్య గతంలో ఆయన కోసం ప్రతిరోజు ఆమె కాళ్లు పట్టుకునే వారట.. ఇక అసలు విషయం ఏమిటో ఇప్పుడు ఒకసారి చదువు తెలుసుకుందాం..

తమిళ్ లో భారతి రాజా దర్శకత్వంలో సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసుకున్న మణ్ వాసనై సినిమాను తెలుగులో మంగమ్మగారి మనవడు సినిమాగా తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా బాలయ్య సినీ కెరియర్ లో ఎంత విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసి కోడి రామకృష్ణ విడుదల చేయడం జరిగింది. సినిమా విడుదలై ఏకంగా సంవత్సరం పాటు థియేటర్లలో ఆడింది అంటే ఇక ఈ సినిమా ఎంత విజయాన్ని సొంతం చేసుకుందో చెప్పవచ్చు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో బాలకృష్ణకు ఎన్టీఆర్ ఒక కండిషన్ పెట్టారట. తమిళ్ సినిమాలో భానుమతి నటించగా.. తెలుగులో కూడా ఆమె నటిస్తేనే నువ్వు నటించాలని చెప్పారట.

బాలకృష్ణ ఈ సినిమాపై ఆసక్తి చూపడంతో ఎన్టీఆర్ స్వయంగా భానుమతిని అడిగి మరి ఈ సినిమాకు ఒప్పించారు. రచయిత్రిగా , సంగీత దర్శకురాలిగా, నిర్మాతగా , డైరెక్టర్ గా , నటిగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న భానుమతి అప్పట్లోనే మంచి ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఇక బాలకృష్ణ కి ఎన్టీఆర్ పెట్టిన షరతుల విషయానికి వస్తే భానుమతి సినిమా షూటింగ్ రావడాని కంటే ముందు బాలకృష్ణ అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. భానుమతి సెట్లో అడుగుపెట్టిన వెంటనే ఆమె కారు డోరు బాలకృష్ణ మాత్రమే ఓపెన్ చేయాలి. ఇక ఆమె కారు దిగిన వెంటనే ప్రతిరోజు ఆమె కాళ్లకు బాలకృష్ణ నమస్కారం చేయాలి.. ఇలా ప్రతిరోజు తన తండ్రి ఎన్టీఆర్ కోరిక మేరకు భానుమతి కాళ్ళు పట్టుకునేవారు బాలకృష్ణ.

Read more RELATED
Recommended to you

Exit mobile version