బాలకృష్ణ ఇంటి ఎదుట ఉద్రిక్తత వాతావరణం..

-

తెలుగు దేశం కీలక నేత, అనంతపురం జిల్లా హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ ఇంటి ఎదుట బుధవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కార్మికుల ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉన్న జీవో 279 ను జారీ చేయడంపై ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో కార్మికులు చెత్తను బాలకృష్ణ ఇంటి ఎదుట వేసి వినూత్న నిరసన చేపట్టారు. స్థానిక పోలీసులు కార్మికుల నిరసనను అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, కార్మికుల మధ్య జరిగిన తోపులాటలో కింద పడిన పారిశుద్య కార్మికురాల నాగమ్మ స్పృహ కోల్పోయింది. దీంతో ఆమెను హుటా హుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా స్థానిక వైద్యుల సిఫార్సు మేరకు బెంగళూరుకు తరలించారు.

గత అక్టోబర్ ఒప్పందానికి విరుద్దంగా

గత అక్టోబర్‌లో జరిగిన 13 రోజుల సమ్మె సంద ర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కార్మిక సంఘా లతో కుదుర్చుకున్న ఒప్పందానికి భిన్నంగా కార్మికులపై అదనపు భారం మోపడంతో పాటు , ఆర్‌టిఎన్‌ఎస్‌ పేరుతో కార్మికులను దొంగలుగా చిత్రించి మెడకు స్కానింగ్‌ మిషన్లు తగిలించడం, ఫేస్‌ రీడిగ్‌ పేరుతో వీడియోలు తీయడం వంటి చర్యలను నిరసిస్తూ చేస్తున్న ఆందోళనను పోలీసులు అడ్డుకుని ఓవర్ యాక్షన్ చేయడాన్ని  సీఐటియు తీవ్రంగా ఖండించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version