ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నికర ఆస్తుల విలువ కంటే..ఆయన మనవడు దేవాన్ష్ నికర ఆస్తులే ఎక్కవగా ఉన్నాయి. బుధవారం ప్రతి ఏటా మాదిరిగానే తమ కుటుంబ ఆస్తులను నారా లోకేశ్ ప్రకటించారు, ఆస్తుల వివరాలు ప్రకటించడం వరసగా ఇది ఎనిమిదో సారి. దీంతో చంద్రబాబు నికర ఆస్తి విలువ రూ.2.99 కోట్లు కాగా.. ఆయన మనవడు దేవాన్ష్ పేరు మీద ఉన్న ఆస్తుల విలువ రూ.18.72 కోట్లుగా చూపడం విశేషం. నారా కుటుంబం మొత్తం ఆస్తుల విలువ రూ.88.68 కోట్లు అని లోకేష్ చెప్పారు.
చంద్రబాబు నికర ఆస్తి విలువ రూ.46 లక్షలు పెరిగి రూ.2కోట్ల 99లక్షల 66వేలకు చేరింది.
నారా భువనేశ్వరి ఆస్తుల విలువ రూ.7 కోట్లు పెరిగి రూ.31కోట్ల 1లక్షా 45వేలు అయింది.
లోకేశ్ ఆస్తి రూ.90 లక్షలు పెరిగి రూ.21 కోట్ల 40 లక్షల 46వేలుగా చూయించారు.
నారా బ్రాహ్మణి నికర ఆస్తి విలువ రూ.7.72 కోట్లు.
కుమారుడు దేవాన్ష్ నికర ఆస్తుల విలువ రూ.18.72 కోట్లు
నిర్వాణ హోల్డింగ్స్ నికర ఆస్తుల విలువ రూ.6.83 కోట్లని వివరించారు.
హెరిటేజ్ ఆస్తుల నికర లాభం రూ.60.38 కోట్లని లోకేష్ వెల్లడించారు.
తిత్లీ తుఫాను సహాయం కింద రూ.60 లక్షలు సాయంగా అందించామని లోకేష్ తెలిపారు.
ఈ ఆస్తుల ప్రకటనను స్వాగతించిన నెటిజన్లు… ఆరు పదుల చంద్రబాబు కంటే..ఆరేళ్ల బుడతడి ఆస్తులు ఎక్కువగా ఉండటంపై సర్వత్రా చర్చనీయాంశమైంది.