ఒక్కొక్కడి తాట తీస్తామని.. బాలయ్య మాస్ వార్నింగ్ ఇచ్చారు. గతంలో టీడీపీ హయాంలో రాష్ట్ర తలసరి ఆదాయం పెంచాము… ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశామని పేర్కొన్నారు. కానీ తర్వాత వచ్చిన కొంతమంది వ్యక్తులు రాష్ట్రాన్ని నాశనం చేశారు… వాళ్ల పేర్లు కూడా చెప్పడం నాకు ఇష్టం లేదని వివరించారు.

సమయం వచ్చినప్పుడు చెప్పడమే కాదు.. వారి తాట తీస్తామని హెచ్చరించారు బాలకృష్ణ. రాష్ట్ర రాజధాని అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. టిడిపి ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ బసవతారకం ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. తుళ్లూరు సమీపంలో బసవతారకం ఆసుపత్రి పనులు ప్రారంభించారు. పూజా కార్యక్రమాలు ముగిసిన అనంతరం బాలకృష్ణ మాట్లాడారు.
అమరావతిలో క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం చేపట్టడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేసే దిశగా ముందడుగులు వేస్తున్నారని సంతోషపడుతున్నారు. ఇదిలా ఉండగా… హైదరాబాద్ లో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ఎంతో మంది ప్రజలకు ఉచితంగా వైద్యాన్ని అందిస్తున్నారు.
దుష్ప్రచారం చేసే వాళ్ల తలలు తీసేయాలి – నందమూరి బాలకృష్ణ pic.twitter.com/BLM69DWdrt
— Telugu Scribe (@TeluguScribe) August 13, 2025