కళ్యాణ్ రామ్ తో కలిసి ” బింబిసార” సినిమా చూసిన బాలయ్య

-

కళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ “బింబిసార”. ఈ సినిమాతో మరొకసారి ఫామ్ లోకి వచ్చాడు కళ్యాణ్ రామ్. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై తరికెక్కిన బింబిసార సినిమా ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో థియేటర్లో సందడి చేస్తోంది. దాదాపు రెండేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత కళ్యాణ్ రామ్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి రిజల్ట్ ను రాబట్టింది. ఈ సినిమా విడుదలకు ముందే తారక్ ఈ చిత్రాన్ని చూశారనే సంగతి తెలిసిందే. అయితే తాజాగా బిబిసారా సినిమాను నందమూరి నటసింహం బాలకృష్ణ వీక్షించారు.

కళ్యాణ్ రామ్, డైరెక్టర్ వశిష్ట తో కలిసి బాలయ్య ఈ చిత్రాన్ని వీక్షించారు. సినిమా చూసిన తర్వాత బాలకృష్ణ బింబిసార చాలా బాగుందని, తనకు ఎంతగానో నచ్చిందని చిత్ర బృందానికి అభినందనలు తెలిపారని సమాచారం. తన విలువైన సమయాన్ని కేటాయించి మా చిత్రాన్ని చూసి, మా కష్టాన్ని గుర్తించినందుకు థాంక్స్ అంటూ ట్వీట్ చేశారు దర్శకుడు వశిష్ట. ప్రస్తుతం బాలయ్య ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version