డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్ నీ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ బోర్డు మెంబర్ గా ఆహ్వానిస్తున్నామని బాలయ్య తెలిపారు. ఇవాళ తన క్యాన్సర్ ఆస్పత్రిలో బాలయ్య మాట్లాడారు. కొత్తగా నిర్మించే బ్లాక్ కి క్యాన్సర్ ను జయించిన కల్యాణి ప్రసాద్ గారి పేరును ప్రకటిస్తున్నామని వివరించారు. ఇంతమంచి కార్యక్రమం కోసం విరాళం అందించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్..క్యాన్సర్ పరిశోధనల కోసం భారీ విరాళం అందజేసినందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పారు.
ఆస్పత్రి లో పరిశోధనలు.. అభివృద్ధి కి ప్రతి పైసా వినియోగిస్తామని మాట ఇస్తున్నానన్నారు. రెండు విడతలుగా 10 కోట్ల రూపాయలు విరాళం ఇవ్వడం ఎంతో స్ఫూర్తిదాయకం అన్నారు. మనిషి తనని తాను అధ్యయనం చేసుకోవడం చాలా అవసరమని.. క్యాన్సర్ గురించి అవగాహన అవసరం అని తెలిపారు. అవగాహన లేకపోవడం తో లాస్ట్ స్టేజ్ లో తెలుసుకుని చనిపోతున్నారని ఆందోళన చెందారు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఆస్పత్రి విస్తరణకు కృషి చేస్తున్నాం.. చికిత్స తో పాటు.. పరిశోధనలు కూడా చేపడుతున్నామన్నారు బాలయ్య.