రేపటి నుంచి మళ్లీ కాళేశ్వరం విచారణ షురూ

-

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ గడువు ముగియడంతో మరోసారి పొడగించారు. దీంతో రేపటి నుంచి విచారణ మళ్లీ ప్రారంభం కానుంది. ఇంతకుముందు విచారణకు హాజరైన వారిలో కొందరిని కమిషన్ మళ్లీ విచారించనుంది.

కమిషన్ ఇప్పటికే 109 మందిని విచారించగా.. ప్రాజెక్టు నిర్మాణంలో భాగమైన ఇంజినీర్లు,సీసీ డిజైన్లు,ఓఅండ్‌ఎం ఇంజినీర్లు, నిర్మాణ ఏజెన్సీ ప్రతినిధులు సమర్పించిన అఫిడవిట్లపై బహిరంగ విచారణ పూర్తయ్యింది.మొత్తం 400 పేజీలతో నివేదిక సిద్ధం చేయగా.. ఇంజినీర్లు, సీడీవో విశ్రాంత సీఈ నరేందర్‌రెడ్డి, కాళేశ్వరం కార్పొరేషన్‌ ఎండీ హరిరాం తదితరులను మరోసారి విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది. కాగా, మరో రెండు నెలల పాటు కమిషన్ గడువును ప్రభుత్వం పొడగించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version