రాబోయే రోజుల్లో బీజేపీ నుంచే టీఆర్ఎస్ లో చేరికలు – బాల్క సుమన్‌

-

రాబోయే రోజుల్లో బీజేపీ నుంచే టీఆర్ఎస్ లో చేరికలుంటాయని ఈటల రాజేందర్‌ కు కౌంటర్‌ ఇచ్చారు బాల్క సుమన్‌. 20 మంది టీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని ఈటెల అంటున్నారు.. కనీసం వార్డు మెంబర్ కూడా టచ్ లో లేరని ఎద్దేవా చేశారు. కేసీఆర్ గజ్వెల్ లో ఈ సారి పోటీ చేయనని ఎవరికి చెప్పారని నిలదీశారు. ఎక్కువ మాట్లాడితే నాలుక చీరేస్తాం…ఈటలకు బాల్క సుమన్‌ వార్నింగ్‌ ఇచ్చారు.

వార్డు మెంబర్ గా లేని ఈటెల ను మంత్రి గా చేసింది కేసీఆర్ యేనని… ఈటెల విశ్వాస ఘాతకుడు, తిన్నింటి వాసాలను లెక్క బెట్టారని నిప్పులు చెరిగారు. ఆరోగ్య మంత్రిగా ఆర్థిక మంత్రిగా ఈటెల అవినీతికి పాల్పడ్డాడని.. కమ్యూనిస్టు కమ్యునలిస్టుగా మారారని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు. హుజూరా బాద్ లో ఈటెల ఓటమి ఖాయం…అందుకే గజ్వెల్ లో కేసీఆర్ పై పోటీ చేస్తానని ప్రగల్భాలు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ లో ఈటెలది బానిస బతుకు అని.. బీసీ, ఎస్సిల భూములు కబ్జా చేసిన నీచ చరిత్ర ఈటెల దన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version