బీజేపీలో చేరాలని ఈటల బిచ్చగాడిలా మారాడు – వివేకానంద

-

బీజేపీలో చేరాలని ఈటల బిచ్చగాడిలా మారాడని టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే కె. పి. వివేకానంద చురకలు అంటించారు. ఈటెల అహంకారం తో బడుగు బలహీన వర్గాల దొర లా మాట్లాడుతున్నారు…కేసీఆర్ ను విమర్శించే స్థాయి ఈటెలది కాదని ఓ రేంజ్‌ లో అగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి గా ఈటెల బీసీ లకు ఏం చేయలేదు…కేవలం కేసీఆర్ ను గద్దె దించడమే కాంగ్రెస్ బీజేపీ ల ఎజెండా గా మారిందన్నారు.

ఈటెల బీజేపీ చేరికల కమిటీ అధ్యక్షుడు ..అంటే బ్రోకర్ లా మారాడా అని నిలదీశారు. ఓ జాతీయ పార్టీ చేరికల కమిటీ వేయడం హాస్యాస్పదమని…ఈటెల గీత దాటితే మేము కూడా గీత దాటుతామని హెచ్చరించారు. ఈటెల చిట్టాను బయటకు తెస్తాం..కబ్జా చేసిన భూములను పేదలకు పంచుతామని స్పష్టం చేశారు. ఈటెల ఎగిరెగిరి మాట్లాడుతున్నారు ..నోరు జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు.

ఈటెల దమ్ముంటే మళ్ళీ హుజురాబాద్ లోనే పోటీ చేసి గెలవాలని సవాల్‌ విసిరారు. హుజురాబాద్ లో మొన్న ఈటెల కాంగ్రెస్, రేవంత్ ల సాయం తో గెలిచారు..ఈటెల ఎక్కువ మాట్లాడితే నాలుక చీరేస్తామని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version